Loading...
Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ కొత్త సినిమా.. ఈసారి ఏకంగా మైథలాజికల్‌ థ్రిల్లర్‌!
నిధి అగర్వాల్‌ కొత్త సినిమా.. ఈసారి ఏకంగా మైథలాజికల్‌ థ్రిల్లర్‌!

Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌ కొత్త సినిమా.. ఈసారి ఏకంగా మైథలాజికల్‌ థ్రిల్లర్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఆమె విభిన్నమైన కథాంశంతో అలరించనున్నట్లు తెలుస్తోంది. నిధి తదుపరి చిత్రం మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని సినీ వర్గాల్లో సమాచారం. హీరోయిన్‌ ప్రధాన పాత్రలో సాగే ఈ సినిమాలో ఆమె ఇప్పటివరకు చేయని ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

వివరాలు

పూజా కార్యక్రమాలతో ప్రారంభం

వరాహ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఆ సంస్థకు తొలి నిర్మాణం కావడం విశేషం. సునీత్‌ పడోల్కర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

'తంత్ర' ఫేమ్‌ శ్రీనివాస్‌ గోపిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

అదే రోజున చిత్రీకరణను కూడా మొదలుపెట్టారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పి. అశోక్‌, పి. రేణుక తొలి షాట్‌కు కెమెరా స్విచాన్‌ చేశారు.

నిధి అగర్వాల్‌ కూడా చిత్రబృందంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా మేకర్స్‌ నిధి అగర్వాల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

వివరాలు

ఆసక్తి పెంచుతున్న ఫస్ట్‌లుక్

ఇందులో నిధి ఒక చేతిలో దీపాన్ని పట్టుకుని.. మరో చేతితో దానికి రక్షణగా నిలిచినట్లు కనిపిస్తోంది.

వెనుక భాగంలో అనేక చేతులతో కూడిన దేవత ఆకారం దర్శనమిస్తోంది. ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

దర్శకుడు శ్రీనివాస్‌ గోపిశెట్టి హీరోయిన్‌ చుట్టూ తిరిగేలా బలమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే నిధి పాత్ర, కథకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్‌ ప్రస్తుతానికి వెల్లడించలేదు.

త్వరలోనే సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్‌ నటించిన 'ది రాజా సాబ్‌', పవన్‌ కల్యాణ్‌ నటించిన 'హరి హర వీర మల్లు' చిత్రాల్లో నిధి అగర్వాల్‌ నటనకు మంచి స్పందన లభించింది.

ఇప్పుడు ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌తో ఆమె ఎలాంటి మెప్పు పొందుతుందో చూడాలి.

ADVERTISEMENT