LOADING...
Swayambhu : యోధుడిగా నిఖిల్.. 'స్వయంభూ' విడుదల తేదీ ఫిక్స్
యోధుడిగా నిఖిల్.. 'స్వయంభూ' విడుదల తేదీ ఫిక్స్

Swayambhu : యోధుడిగా నిఖిల్.. 'స్వయంభూ' విడుదల తేదీ ఫిక్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 24, 2026
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభూ'. భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి నిఖిల్ పడుతున్న శ్రమ విశేషమనే చెప్పాలి. ఒక యోధుడి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయేందుకు నిఖిల్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కే పరిమితం కాకుండా, యుద్ధ సన్నివేశాల్లో సహజత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో విదేశాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు. కత్తిసాము, గుర్రపు స్వారీ, ఆర్చరీ (విలువిద్య)లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుని పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారు.

Details

ఏప్రిల్ 10న రిలీజ్

పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విజువల్స్ పరంగా హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయని మేకర్స్ సమాచారం. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులకు విజువల్ వండర్‌గా నిలవనుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై మేకర్స్ స్పష్టత ఇచ్చారు. ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ పాన్-ఇండియా చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

Details

హీరోయిన్ గా సంయుక్త మీనన్

నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారగా, ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సినిమాపై అంచనాలను మరో మెట్టు ఎక్కించింది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చారిత్రక గాథను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో 'స్వయంభూ' అడుగులు వేస్తోంది.

Advertisement