Page Loader
పాన్ ఇండియా లెవల్లో నిఖిల్ మూవీకి క్రేజ్.. రేటు చూస్తే మైండ్ బ్లాక్
స్పై మూవీలో హీరోగా నటిస్తున్న నిఖిల్

పాన్ ఇండియా లెవల్లో నిఖిల్ మూవీకి క్రేజ్.. రేటు చూస్తే మైండ్ బ్లాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 07, 2023
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో నిఖిల్ వరుస విజయాల్లో మంచి జోష్ మీద ఉన్నారు. రీసెంట్‌గా కార్తికేయ-2, 18 పేజీస్ భారీ హిట్‌ను అందుకున్నాడు. కార్తికేయ చిత్రం ఎన్నో అవార్డులను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మరెన్నో రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిఖిల్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిఖిల్ 19వ చిత్రానికి గూఢచారి, ఎవరు, హిట్ వంటి సూపర్ హిట్స్ చిత్రాల ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. యాక్షన్‌తో కూడిన స్పై థ్రిల్లర్‌గా భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్పై అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎడ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

నిఖిల్

డిజిటల్ రైట్స్‌ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ నెట్‌వర్క్!

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్, పోస్టర్‌లకు విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడయ్యాయని సమాచారం. డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్ ఏకంగా 40 కోట్లకి అమెజాన్ ప్రైమ్ నెట్‌వర్క్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిందట .అన్ని భాషలలో కలిసి కనీసం 60 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉంటుందని ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు.