LOADING...
Swayambhu : నిఖిల్ 'స్వయంభు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?
నిఖిల్ 'స్వయంభు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?

Swayambhu : నిఖిల్ 'స్వయంభు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

'కార్తికేయ 2'తో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌.. ఆ తర్వాత తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలతో తన ఇమేజ్‌కు కొంత డ్యామేజ్‌ చేసుకున్నాడు. 18 పేజెస్ పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక 'స్పై', అప్పుడో ఎప్పుడో ఇప్పుడో వంటి సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలవడంతో, నిఖిల్‌ ప్రస్తుతం చాలా స్లోగా, ఆచితూచి ప్రాజెక్టులను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడంతా అతడి ఆశలు పెట్టుకున్న సినిమా పీరియాడిక్ వార్ డ్రామా 'స్వయంభు'. ఈ సినిమాతో మళ్లీ గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని నిఖిల్‌ ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ కోసం కేవలం గెటప్స్ మార్చడమే కాదు.. దాదాపు రెండేళ్ల పాటు పూర్తిగా ఈ సినిమాకే కమిట్ అయ్యాడు.

Details

అత్యంత భారీ బడ్జెట్ తో స్వయంభు

170 రోజుల భారీ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న స్వయంభు టీమ్‌ ఇటీవలే గుమ్మడికాయ కొట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇప్పటివరకు ప్రమోషన్స్‌ మొదలుపెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. షూట్ కంప్లీషన్ వీడియో తప్ప మరో కీలక అప్‌డేట్ ఇవ్వలేదు. సంక్రాంతికి విడుదల చేసిన పోస్టర్లలో కనిపించిన రిలీజ్ డేట్ ఇప్పుడు కనిపించకుండా పోయింది. 'స్వయంభు'ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాత తెరకెక్కిస్తున్నారు.

Details

మార్చి 23 లేదా ఏప్రిల్ 30 తేదీల్లో విడుదల అయ్యే ఛాన్స్

అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా వాయిదా పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక కొత్త రిలీజ్ డేట్ విషయంలో మార్చి 23 లేదా ఏప్రిల్ 30 తేదీల్లో విడుదల చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై నిఖిల్‌ ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. 'స్వయంభు' కోసం గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు వంటి కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. మరి ఈ భారీ పీరియాడిక్ డ్రామా నిఖిల్‌కు మరో పాన్‌ ఇండియా హిట్‌ను అందిస్తుందో లేదో చూడాలి.

Advertisement