Loading...
Nithiin Ram Abbaraju Movie: సరికొత్త జానర్‌ ట్రై చేస్తున్న నితిన్‌.. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో సినిమా
సరికొత్త జానర్‌ ట్రై చేస్తున్న నితిన్‌...రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో సినిమా

Nithiin Ram Abbaraju Movie: సరికొత్త జానర్‌ ట్రై చేస్తున్న నితిన్‌.. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో సినిమా

వ్రాసిన వారు Balachander Sharma
Nov 26, 2026
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్‌ హీరో నితిన్‌ వరుస సినిమాలతో కెరీర్‌లో కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్న ఆయన ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో, 'సామజవరగమన' ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో నితిన్‌ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. నాని సమర్పణలో తెరకెక్కిన 'అలియాస్‌ రుక్మిణి'తో డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్‌.. ఆ తర్వాత ఈ కొత్త సినిమాతో మరోసారి తన అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడట.

Details

ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా..

నితిన్‌ కోసం రామ్‌ అబ్బరాజు ఓ ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

'సామజవరగమన', 'నారి నారి నడుమ మురారి' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన కామెడీ మార్క్‌ను ఏర్పరుచుకున్న రామ్‌ అబ్బరాజు.. ఈసారి నితిన్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథను రూపొందించినట్లు సమాచారం.

సాధారణ కుటుంబ కథలోనే వినోదాన్ని పంచేలా స్క్రిప్ట్‌ ఉండబోతుందనే టాక్‌ వినిపిస్తోంది.

దీంతో ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే నితిన్‌ నుంచి కొంత కొత్త తరహా ఎంటర్‌టైన్‌మెంట్‌ చూడొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Details

మైత్రీతో నితిన్‌కు మరో కాంబినేషన్

ఈ ప్రాజెక్ట్‌తో నితిన్‌ మరోసారి మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయబోతున్నాడు.

గతంలో ఇదే బ్యానర్‌లో 'రాబిన్‌హుడ్‌' సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే నిర్మాణ సంస్థతో చేతులు కలపడం ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం రామ్‌ అబ్బరాజు.. శ్రీవిష్ణు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న 'ఫ్యామిలీ ప్యాక్‌' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది.

ADVERTISEMENT

Details

వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం

'ఫ్యామిలీ ప్యాక్‌' విడుదలైన తర్వాత రామ్‌ అబ్బరాజు ఫ్రీ కానున్న నేపథ్యంలో నితిన్‌తో చేయబోయే సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని సమాచారం.

కథ, నటీనటులు, షూటింగ్‌ తదితర వివరాలపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

నితిన్‌ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్‌ చేసే వినోదాత్మక కథతో ఈ కాంబినేషన్‌ రావడం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT