Robinhood: నితిన్ 'రాబిన్‌హుడ్' విడుదల తేదీని లాక్ చేసిన మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా 'రాబిన్ హుడ్'.ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
నేడు శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని ఈ చిత్రం నుండి బిగ్ అప్డేట్ ను మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో హీరో నితిన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
రాశి ఖన్నా,రాజేంద్ర ప్రసాద్,వెన్నెల కిషోర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Make way for the conman you'd love to meet ❤🔥#Robinhood in cinemas from December 20th, 2024 💥💥@actor_nithiin @VenkyKudumula @gvprakash @SonyMusicSouth pic.twitter.com/8uARUhDGlX
— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2024