
Robinhood Teaser: నితిన్ 'రాబిన్‌హుడ్' టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
నితిన్ కథానాయకుడిగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'రాబిన్‌హుడ్'. ఈ చిత్రం భీష్మ తర్వాత, ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండవ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు.
దీపావళి సందర్భాన్ని పురస్కరించుకొని, చిత్ర బృందం రాబిన్‌హుడ్ నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన అప్డేట్‌ను కూడా పంచుకున్నారు.
రాబిన్‌హుడ్ టీజర్‌ను నవంబర్ 14న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
వివరాలు
డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల
ఒక పోస్టర్‌ను విడుదల చేసి, టీజర్ అనౌన్స్‌మెంట్‌ను పంచుకున్నారు. నితిన్ ముసుగులో ఉన్న ఫోటోను కూడా వారు అభిమానులతో పంచుకున్నారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి.
రాబిన్‌హుడ్ సినిమా డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల కాబోతున్నది.
రాబిన్‌హుడ్ సినిమాలో నితిన్ దొంగ పాత్రలో కనిపించబోతున్నారు.
వినోదం, సందేశం, యాక్షన్ థ్రిల్లర్ పధతిలో రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చుతున్నారు.
రాజేంద్రప్రసాద్,వెన్నెల కిశోర్ వంటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవలి పరాజయాలు ఎదుర్కొంటున్న నితిన్ ఈ చిత్రంతో పెద్ద అంచనాలు పెట్టుకున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎల్లుండే రాబిన్ హుడ్ కి ముహూర్తం ఖరారు
#RobinhoodTeaser on Nov 14th at 4:05 PM 💥💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) November 12, 2024
Adventurous Entertainer coming your way!#Robinhood pic.twitter.com/XWIWBE30xD