
Nithin : యంగ్ హీరోయిన్ శ్రీలీలపై నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆమెను ఏమని పొగిడిరంటే
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా దర్శకుడు వక్కంతం వంశీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man)చిత్రం తెరకెక్కుతోంది.
ఈ మేరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల టాలెంట్ గురించి నితిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
శ్రీలీల నిజ జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ మహిళ అని ప్రశంసల జల్లు కురిపించారు.
తనకు భరతనాట్యం, కూచిపూడి తెలుసని, రాష్ట్ర స్థాయిలో హాకీ ప్లేయర్, స్విమ్మింగ్‌లోనూ మంచి రికార్డు ఉందన్నారు.
త్వరలోనే మెడిసిన్ సైతం పూర్తి చేయనున్నారని చెప్పారు. ఇదే సమయంలో నితిన్ ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పారు.డిసెంబర్ 8న అభిమానులందరూ కాలరు ఎగరేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నితిన్ - శ్రీలీల నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ డిసెంబర్ 8న రిలీజ్ కానుంది.
DETAILS
డిస్ట్రిబ్యూట్ చేసిన తొలి సినిమా మగాడు
ప్రీరిలీజ్ ఈవెంట్'లో భాగంగా ''ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని నితిన్ అన్నారు.
నా కెరీర్‌లో ఇంతమంచి పాత్ర ఎప్పుడూ చేయలేదని, మా నాన్నడిస్ట్రిబ్యూటర్‌గా మారాక, డిస్ట్రిబ్యూట్ చేసిన తొలి సినిమా 'మగాడు'(హీరోగా రాజశేఖర్) సినిమా సూపర్ హిట్ అయ్యిందన్నారు.
ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి రాజశేఖర్ ప్రధాన కారణమన్నారు. ఆయన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చేయడమే మాకు పెద్ద బహుమతి అన్నారు.
సినిమా బాగా రావడం కోసం నిర్మాత ఎక్కడా రాజీపడలేదని, చిత్రంలో రాజశేఖర్ నటించాలని బలంగా కోరుకున్నానని, ఆయన నటించడం నా అదృష్టమని దర్శకుడు వంశీ అన్నారు.
నా పాత్రకు హద్దులు లేవని, కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారని శ్రీలీల చెప్పుకొచ్చారు.