Page Loader
Mad Square: మ్యాడ్ స్క్వేర్ టీజ‌ర్ వ‌చ్చేసింది.. నవ్వులే . . నవ్వులు 

Mad Square: మ్యాడ్ స్క్వేర్ టీజ‌ర్ వ‌చ్చేసింది.. నవ్వులే . . నవ్వులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ "మ్యాడ్ స్క్వేర్" (MAD Square) రాబోతోంది. సూపర్ హిట్ చిత్రం "మ్యాడ్" కి ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. మొదటి పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ సహా మరికొందరు నటులు ఈ సినిమాలో కూడా కొనసాగుతున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, నాగవంశీ నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి టీజర్ (MAD Square Teaser) ను మేకర్స్ విడుదల చేశారు.

వివరాలు 

 "లడ్డుగాని పెళ్లి" 

టీజర్‌ను పరిశీలిస్తే, ఈ సినిమా "లడ్డుగాని పెళ్లి" నేపథ్యంలో సాగే కథాంశంగా ఉంటుందని తెలుస్తోంది. లడ్డుగాని పెళ్లికి హాజరైన ఫ్రెండ్స్ గ్యాంగ్ బ్యాచిలర్ పార్టీ కోసం గోవాకి వెళతారు. ఆ ప్రయాణంలో ఏమి జరిగింది? ఏ రకాల సంఘటనలు ఎదురయ్యాయి? అన్నదే సినిమా ప్రధాన కథ. ఇక "మ్యాడ్" సినిమాలో వన్ లైనర్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన చిత్రబృందం, ఈ సీక్వెల్‌లోనూ అదే స్థాయిలో నవ్వులు పూయించబోతున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్