LOADING...
Nithiin : నితిన్ కొత్త ప్రాజెక్ట్‌.. సితార బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్స్ ఎంట్రీ
నితిన్ కొత్త ప్రాజెక్ట్‌.. సితార బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్స్ ఎంట్రీ

Nithiin : నితిన్ కొత్త ప్రాజెక్ట్‌.. సితార బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్స్ ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ హీరో నితిన్ వరుస పరాజయాలతో కెరీర్‌లో కాస్త వెనుకబడ్డాడు. బీష్మ తర్వాత సరైన హిట్‌ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన, కొంత విరామం తీసుకుని ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో సోము, నర్రి అనే ఇద్దరు డెబ్యూ డైరెక్టర్లు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మే 4న లాంఛనంగా ప్రారంభం కానుండగా, మే 6 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ మొదలు పెట్టాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది.

వివరాలు

55 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలి

ముందస్తు షెడ్యూల్‌తో కేవలం 55 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే రెండు నెలల లోపే చిత్రీకరణ ముగియనుంది. నితిన్ కెరీర్‌లో ఇది వేగంగా పూర్తయ్యే ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా రితికా నాయక్ నటించనున్నారు. అశోక వనంలో అర్జున కల్యాణంతో గుర్తింపు పొందిన ఆమెకు, నితిన్‌తో ఇది తొలి సినిమా. ఇక సంగీత బాధ్యతలను సురేష్ బొబ్బిలి చేపట్టనున్నారు. ఎన్నాళ్లుగానో హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‌కు, ఈ డెబ్యూ దర్శకులు విజయం అందిస్తారో లేదో అన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.

Advertisement