
Nithyamenon: నిత్యామీనన్...గుండె జారి గల్లంతయ్యిందే!
ఈ వార్తాకథనం ఏంటి
నిత్యామీనన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రం నుంచి ఆ సినిమా యూనిట్ కొత్త అప్ డేట్ ఇచ్చింది.
నిత్యా మీనన్ తాజాగా ప్రాజెక్టు 'డియర్ ఎక్స్'. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
నిత్యామీనన్ బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇంకేముంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైబ్.
నిత్యామీనన్ కు బర్త్ డే విషెస్ తో పాటు ఆమె ఫస్ట్ లుక్ పిక్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
అలామొదలైంది చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నిత్యామీనన్ వరుసగా ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో మంచి పొజిషన్ కే వెళ్లింది.
Dear X Nithya Menon
ఫస్ట్ లుక్ తో సినిమాపై పెరిగిన అంచనాలు
ఆ తర్వాత శర్వానంద్ తో నటించిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాతో నిత్యా మీనన్ సినీ విమర్శకులు ప్రశంసలు అందుకొంది.
ఇక చేతిలో కాక్ టెయిల్ మందు గ్లాసు పట్టుకుని కళ్లకు కూలింగ్ గ్లాస్ గూగూల్స్ పెట్టుకుని ఇచ్చిన ఫోజుకి ఇప్పుడు కుర్రకారు గుండెలు గల్లంతవ్వడం ఖాయమే.
చిత్ర యూనిట్ ఇచ్చిన ఫస్ట్ లుక్ ట్రీట్ తో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.