Prabhas - Nbk : వాయిదా పడే ఛాన్సే లేదు.. 'ఫౌజీ', 'దాదా'లకు ఓటీటీ సంస్థల స్ట్రిక్ట్ రూల్స్
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబర్ నెల బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల మధ్య హోరాహోరీ పోరుకు వేదిక కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డిసెంబర్ 3న 'ఫౌజీ'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా.. నటసింహం బాలకృష్ణ డిసెంబర్ 24న 'దాదా'తో సందడి చేయనున్నారు. అయితే ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై ఇటీవల పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ'కి ఇంకా చాలా వర్క్ పెండింగ్‌లో ఉందని, అనుకున్న డిసెంబర్ 3న సినిమా విడుదల కాకపోవచ్చని.. మరోసారి వాయిదా పడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాలకృష్ణకు గాయం కావడంతో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దాదా' షూటింగ్‌కు కూడా బ్రేక్ పడింది. దీంతో సినిమా సమ్మర్‌కు వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది.
వివరాలు
ఇటీవల కాలంలో కఠిన నిబంధనలు అమలు
అయితే ఈ రెండు సినిమాల విషయంలో రిలీజ్ వాయిదా అనే మాటే లేదని మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది.
ఇందుకు ప్రధాన కారణం ఓటిటి సంస్థలతో చేసుకున్న ఒప్పందాలేనని తెలుస్తోంది. ఇటీవల ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కొనుగోలు విషయంలో కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
సినిమాల థియేట్రికల్ రిలీజ్ తేదీలను ముందుగానే ఖరారు చేసుకుని.. వాటిని ఒప్పందాల్లో స్పష్టంగా పొందుపరుస్తున్నాయి.
ఒకవేళ నిర్ణయించిన థియేట్రికల్ రిలీజ్ తేదీలో మార్పు చేసినా, సినిమా వాయిదా పడినా ఓటీటీ ఒప్పందం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
అంతేకాదు.. అగ్రిమెంట్‌లో ఖరారు చేసిన మొత్తంలో కోత విధించే పరిస్థితి కూడా ఉండొచ్చని సమాచారం.
వివరాలు
సినిమా విడుదల తేదీలను మార్చకూడదు
'ఫౌజీ', 'దాదా' చిత్రాల ఓటీటీ హక్కులను సంబంధిత సంస్థలు భారీ మొత్తాలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు విధించిన కఠినమైన షరతుల నేపథ్యంలో.. తమ సినిమాల విడుదల తేదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని నిర్మాణ సంస్థలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
దీంతో ప్రస్తుతం వినిపిస్తున్న వాయిదా వార్తలకు చెక్ పడినట్లేనని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్ 'ఫౌజీ' డిసెంబర్ 3న, బాలకృష్ణ 'దాదా' డిసెంబర్ 24న థియేటర్లలోకి రానున్నాయి.
ఈ రెండు భారీ చిత్రాలు ఒకే నెలలో విడుదల కానుండటంతో డిసెంబర్ బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.