
Manchu Manoj: నన్ను మాత్రమే కాదు.. నా కుటుంబాన్నీ నిలబెట్టారు : మంచు మనోజ్ ఎమోషనల్
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మిరాయ్' (Mirai) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి రోజే రూ.27 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విజయోత్సాహంతో చిత్రబృందం ప్రత్యేకంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో మంచు మనోజ్ మాట్లాడుతుండగా భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. 12 ఏళ్ల తర్వాత విజయాన్ని అందుకున్న ఈ క్షణం నాకు కలలా అనిపిస్తోంది. ఫోన్ నిరంతరం అభినందనలతో మోగుతూనే ఉంది. ఈ కథలో నన్ను భాగస్వామ్యం చేసిన కార్తిక్‌కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను.
Details
కార్తీక్ ఆ భయాన్ని పొగట్టాడుమిరాయ్
ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళినా.. 'అన్నా సినిమా ఎప్పుడు చేస్తావు? కమ్‌బ్యాక్ ఎప్పుడుంటుంది?' అని అడిగేవారు. బయట ధైర్యంగా సమాధానం చెప్పినా, లోపల మాత్రం తెలియని భయం ఉండేది. చాలా సినిమాలు చివరి క్షణంలో ఆగిపోయాయి. అలాంటి సమయంలో కార్తిక్ నన్ను నమ్మడం నా అదృష్టం. మీరు నన్ను మాత్రమే నిలబెట్టలేదు, నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారని మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. తన పిల్లల గురించి ఎప్పుడూ ఆందోళన చెందేవాడినని కూడా మనోజ్ గుర్తు చేసుకున్నారు. నేను పెరిగినట్లే నా పిల్లల్ని పెంచగలనా అని ఎప్పుడూ భయపడేవాడిని. ఆ భయాన్ని కార్తిక్ పోగొట్టాడు.
Details
ఇక వరుస సినిమాలు చేస్తా
నిర్మాత విశ్వప్రసాద్ కూడా ఎంతో నమ్మకంతో ఈ సినిమాను పూర్తి చేశారు. 'మనోజ్‌తో సినిమా వద్దు' అని ఆయనకు చాలామంది చెప్పి ఉండొచ్చు. కానీ వాటిని పట్టించుకోకుండా నిర్మించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 'మిరాయ్' వీఎఫ్‌ఎక్స్ టీమ్ తెలుగు సినిమాకు గర్వకారణం అయ్యింది. ఒక విషయం చెప్పాలి.. నా విజయం కోసం ప్రతి ఇంట్లోనూ కోరుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నాపై నమ్మకం పెట్టుకున్న అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇకపై వరుస సినిమాలతో మీ ముందుకు వస్తానని మనోజ్ భావోద్వేగంగా తెలిపారు. 'మిరాయ్' సినిమాలో మనోజ్ పోషించిన 'మహావీర్ లామా' పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.