LOADING...
Manchu Lakshmi: ఏదీ మనది కాదు.. మంచులక్ష్మి పోస్టు వైరల్!
ఏదీ మనది కాదు.. మంచులక్ష్మి పోస్టు వైరల్!

Manchu Lakshmi: ఏదీ మనది కాదు.. మంచులక్ష్మి పోస్టు వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2024
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తాజాగా సినీ వర్గాలు, సోషల్ మీడియా చర్చల్లో ప్రధానంగా నిలుస్తోంది. మంచు మనోజ్, మోహన్ బాబు, విష్ణు మధ్య నెలకొన్న విభేదాలు ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంచు కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా మంచు లక్ష్మి చేసిన ట్విట్టర్ పోస్టు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 'ఈ ప్రపంచంలో ఏదీ మనది కానప్పుడు, ఏదో కోల్పోతామని భయం ఎందుకు?' అనే ఓ రచయిత చెప్పిన కొటేషన్‌ను ఆమె షేర్ చేశారు.

Details

యక్షిణి వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన మంచు లక్ష్మి

కొంతమంది నెటిజన్లు ఈ కొటేషన్ మీ తండ్రి, తమ్ముళ్లకు షేర్ చేయండి. వారికే ఇది అవసరం అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మంచు లక్ష్మికి సలహా ఇస్తూ, ఇలాంటి సమయంలో మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఇలాంటి అనవసరమైన పోస్టులతో మీకే ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. ఇక వివాదాల మధ్య కూడా మంచు లక్ష్మి తన కెరీర్‌పై దృష్టి పెట్టారు. ఇటీవల, ఆమె 'యక్షిణి' అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ముంబయిలో నివసిస్తున్న మంచు లక్ష్మి, అక్కడ అవకాశాలపై దృష్టి పెట్టినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.