Page Loader
Nayanthara: నయనతారకు నోటీసులు పంపలేదు.. క్లారిటీ ఇచ్చిన 'చంద్రముఖి' నిర్మాతలు
నయనతారకు నోటీసులు పంపలేదు.. క్లారిటీ ఇచ్చిన 'చంద్రముఖి' నిర్మాతలు

Nayanthara: నయనతారకు నోటీసులు పంపలేదు.. క్లారిటీ ఇచ్చిన 'చంద్రముఖి' నిర్మాతలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ నటి నయనతారకు 'చంద్రముఖి' సినిమా నిర్మాతలు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టంచేశారు. చిత్ర డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' విడుదలైన తర్వాత, ఈ వివాదం ముందుకొచ్చింది. నయనతార డాక్యుమెంటరీలో 'చంద్రముఖి' సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉపయోగించినట్లు వచ్చిన వార్తలపై, 'శివాజీ ప్రొడక్షన్స్' స్పందించిందని వారు తెలిపారు. నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ చిత్రానికి ముందు, 'రౌడీ పిక్చర్స్' సంస్థ మా వద్ద నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్ తీసుకుందని, డాక్యుమెంటరీలోని సన్నివేశాలను ఉపయోగించడంపై తాము ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదని తెలిపారు.

Details

ముదురుతున్న వివాదం

అలాగే రూ.5 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను కూడా నిర్మాతలు తోసిపుచ్చారు. ఈ వివాదం మరోపక్క, 'నానుమ్‌ రౌడీ దాన్‌' చిత్రంలో ఉన్న మూడు సెకన్ల క్లిప్‌ను అంగీకారం లేకుండా ఉపయోగించినందుకు నటుడు ధనుష్‌ నయనతారకు లీగల్‌ నోటీసులు పంపించారు. ఆయన రూ.10 కోట్ల డిమాండ్‌ చేశారు. ఈ వివాదం మరింత వేడెక్కింది. ధనుష్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు, జనవరి 8వ తేదీ లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయనతార, ఆమె భర్త, నెట్‌ఫ్లిక్స్ బృందాన్ని ఆదేశించింది.