Page Loader
ఎన్టీఆర్ 30: తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం?
ఎన్టీఆర్ 30 లో రెండు పాత్రల్లో కనిపించనున్నాడని వార్తలు

ఎన్టీఆర్ 30: తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం?

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 10, 2023
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో అప్డేట్ బయటకు వస్తుండడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతూ ఉంది. తాజాగా ఎన్టీఆర్ 30లో ఎన్టీఆర్ రోల్ గురించి సోషల్ మీడీయాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని అంటున్నారు. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, తండ్రి పాత్రలో ఎన్టీఆర్ వేషధారణ, నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుందనీ చెబుతున్నారు. ఇకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పాలి. ఎన్టీఆర్ ని విభిన్నమైన పాత్రల్లో చూడాలనుకున్న వారికి ఎన్టీఆర్ 30 మంచి ట్రీట్ అందించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై ఎన్టీఆర్ 30 టీమ్ స్పందిస్తుందేమో చూడాలి.

ఎన్టీఆర్ 30

విలన్ కోసం బాలీవుడ్ లో గాలిస్తున్న కొరటాల

ఎన్టీఆర్ 30ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు కొరటాల శివ ప్రయత్నిస్తున్నారు. తను ఇప్పటివరకు తీసిన సినిమాల కంటే ఎన్టీఆర్ 30 వైవిధ్యంగా ఉంటుందని గతంలోనే కొరటాల ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తో పెరిగిన ఎన్టీఆర్ ఇమేజ్ ని మరింత పెంచడానికి హాలీవుడ్ టెక్నీషియన్లను దింపాడు కొరటాల. యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ బ్రాడ్ మిన్నిచ్ హాలీవుడ్ సినిమాలకు పనిచేసినవారే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రంలో విలన్ కోసం బాలీవుడ్ యాక్టర్ ని తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యువసుధ ఆర్ట్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతుంది.