Page Loader
NTR31: ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్  
ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్

NTR31: ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన ఎన్టీఆర్  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) హీరో జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) కాంబోలో రాబోయే సినిమా (NTR31) గురించి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల 'దేవర' ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్‌ ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ను పంచుకున్నారు. 'ప్రశాంత్‌ నీల్‌ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ 21 నుండి ప్రారంభమవుతుంది. తొలి షెడ్యూల్‌ 40 రోజుల పాటు సాగుతుంది,అయితే నేను అందులో పాల్గొను. ఇతర నటీనటుల సన్నివేశాలు చిత్రీకరిస్తారు. నేను జనవరిలో షూటింగ్‌లో పాల్గొంటాను' అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. ఈ సినిమా కోసం 'డ్రాగన్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. Shoot పూర్తయిన తర్వాత 'దేవర 2'లో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వివరాలు 

త్వరలోనే 'దేవర' ప్రీరిలీజ్‌ ఈవెంట్

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన 'దేవర' చిత్రం సెప్టెంబర్‌ 27న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ఈ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ నీల్‌, రాజమౌళి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం ఉంది, దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'దేవర' యాక్షన్‌ డ్రామాగా రూపొందింది. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన 'చుట్టమల్లే' ,'దావూదీ' పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. జాన్వీ కపూర్‌ ఈ మూవీ ద్వారా టాలీవుడ్‌కి పరిచయమవుతుండగా, సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.