NTR : ఎన్టీఆర్‌కి వెట్రిమారన్ కథ వినిపించారు.. ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి!
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' ప్రమోషన్ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్టీఆర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ప్రశాంత్ నీల్' దర్శకత్వంలో తన తదుపరి సినిమా అక్టోబరు 21 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయితే ఈ 40 రోజుల మొదటి షెడ్యూల్‌లో తాను పాల్గొంటానని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, 'దేవర 2' షూటింగ్ ప్రారంభమవుతందని తెలియజేశారు. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ విలేకరుల సమావేశంలో, 'వెట్రిమారన్' తో కలిసి సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
సెప్టెంర్ 27న 'దేవర'
ఈ ప్రాజెక్టు గురించి వెట్రిమారన్ కూడా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన ఎన్టీఆర్‌కు ఒక స్క్రిప్ట్ వినిపించానని, ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టుపై దృష్టి సారిస్తానని తెలిపారు. ఇక ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'దేవరదేవర' చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.