LOADING...
NTR Pranathi Wedding Anniversary : ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి వెడ్డింగ్ యానివర్సరీ.. క్యూట్ ఫొటోలు వైరల్
ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి వెడ్డింగ్ యానివర్సరీ.. క్యూట్ ఫొటోలు వైరల్

NTR Pranathi Wedding Anniversary : ఎన్టీఆర్-లక్ష్మి ప్రణతి వెడ్డింగ్ యానివర్సరీ.. క్యూట్ ఫొటోలు వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

నేడు జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతి దంపతులు తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈసందర్భంగా ఎన్టీఆర్-ప్రణతి దంపతుల అందమైన, అరుదైన ఫోటోలను ఫ్యాన్స్ విస్తృతంగా షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారి అన్యోన్యత, సరళమైన కుటుంబ జీవనం గురించి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలో లక్ష్మి ప్రణతి కీలక పాత్ర పోషిస్తుండగా, ఈ జంట టాలీవుడ్‌లో ఆదర్శ దంపతులుగా పేరుగాంచింది. ఈ 15ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధురమైన క్షణాలను కలిసి పంచుకున్న ఈ జంట, ఇలాగే ఆనందంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement