NTR 31 : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సాలీడ్ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ ప్రకటన
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ మూవీగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టుడియోలో నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం #NTRNeel' హ్యాష్ ట్యాగ్ ను చేస్తున్నారు.
2026 జనవరి 9న రిలీజ్
ఈ మేరకు మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 2026, జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇవాళ వైభవంగా జరిగింది. ఈ సినిమాను యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 చిత్రాలలో నటిస్తున్నారు. దేవర తొలిభాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది.