NTRNeel : ఎన్టీఆర్-నీల్ మూవీ బ్యాక్‌డ్రాప్ ఏంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా గ్యాప్ లేకుండా వరుసగా ప్రాజెక్టులను సెట్స్‌పైకి తీసుకువెళుతున్నాడు.
"దేవర" తో భారీ విజయం సాధించిన ఆయన, పాన్-ఇండియా స్థాయిలో తన మార్కును మరింత పెంచుకున్నాడు.
ఇదే జోష్‌లో బాలీవుడ్ డెబ్యూ చిత్రం "వార్ 2" షూటింగ్‌ను కూడా పూర్తి చేశాడు.
తాజాగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించాడు.
ఈ సినిమాకు "డ్రాగన్" అనే పేరు పరిశీలనలో ఉంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించిన దర్శకుడు, అల్లర్లు, రాస్తారోకో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు.
ప్రారంభ దశలో నెల రోజుల పాటు ఎన్టీఆర్ లేకుండా కొన్ని సన్నివేశాలను షూట్ చేయనున్నారు.
వివరాలు
బెంగాల్ నేపథ్యంలో..
మార్చి నెలాఖరు నుంచి ఎన్టీఆర్ సెట్స్‌లోకి చేరనున్నారని సమాచారం. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌పై ఎక్కువ సమయం కేటాయించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమా కథ 1960 కాలంలో బెంగాల్ నేపథ్యంలో సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నాడు.
అందుకు తగ్గట్టుగా, ఎన్టీఆర్‌ను అత్యంత శక్తివంతమైన పాత్రలో, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది.
కన్నడ సంగీత దర్శకుడు రవి బస్రుర్ సంగీతాన్ని అందిస్తుండగా,ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.