LOADING...
Ntr-Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ అప్‌డేట్‌.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న లొకేషన్ ఇదే!
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ అప్‌డేట్‌.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న లొకేషన్ ఇదే!

Ntr-Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ అప్‌డేట్‌.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న లొకేషన్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2026
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'సాలార్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిన్న అప్‌డేట్ కూడా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్‌కు మర్చిపోలేని బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అత్యంత కేర్‌తో రూపొందిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Details

హైదరాబాద్‌లో భారీ సెట్

మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీపడడం లేదని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తోంది. ఇటీవల నిర్మాత రవి చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. చిన్న చిన్న డీటెయిల్స్ విషయంలో కూడా ప్రశాంత్ నీల్ అస్సలు కాంప్రమైజ్ అవడం లేదని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా క్వాలిటీ ఉండేలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా రూపొందిస్తున్నారని నిర్మాత రవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో ప్రారంభమైంది.

Details

 అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా 'డ్రాగన్' 

ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్‌తో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక మరోసారి ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లనున్నారని సమాచారం. అక్కడ జరిగే షూటింగ్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తవుతుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా 'డ్రాగన్' అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాల్లా కేవలం హీరో ఎలివేషన్స్‌కే పరిమితం కాకుండా, ఈ సినిమాలో ఎమోషన్స్‌కు కూడా పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Advertisement