LOADING...
NtrNeel: 'డ్రాగన్'లో ఎన్టీఆర్ అరాచకం.. కాళీ ఘాట్ సీక్వెన్స్‌కు పూనకాలే!
'డ్రాగన్'లో ఎన్టీఆర్ అరాచకం.. కాళీ ఘాట్ సీక్వెన్స్‌కు పూనకాలే!

NtrNeel: 'డ్రాగన్'లో ఎన్టీఆర్ అరాచకం.. కాళీ ఘాట్ సీక్వెన్స్‌కు పూనకాలే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 15, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, అలాగే దేవరతో సంచలనం సృష్టించిన తారక్ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. నీల్ మార్క్ ఎలివేషన్స్‌కు ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ జతకావడంతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నమోదవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

వివరాలు

యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్

చిత్రంలో ఉండే 'కాళీ ఘాట్' యాక్షన్ సీక్వెన్స్ మొత్తం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇప్పటికే 'సలార్'లో కనిపించిన కాటేరమ్మ ఫైట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, దానికంటే పదిరెట్లు ఎక్కువ మాస్ ఎలిమెంట్స్, వైల్డ్ ఎనర్జీతో ఈ 'కాళీ ఘాట్' ఎపిసోడ్‌ను ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఎవరూ ఊహించని స్థాయిలో ఈ యాక్షన్ ఘట్టం ఉండబోతోందని, థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ఈ సీక్వెన్స్ కోసం భారీ సెట్లు నిర్మించడమే కాకుండా, విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.

వివరాలు

వచ్చే ఏడాది రిలీజ్

తనదైన డార్క్ థీమ్‌ను కొనసాగిస్తూ, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌ను మరింత నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మాస్ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి వస్తుండటంతో వెండితెరపై భారీ స్థాయి మాస్ విధ్వంసం చూడబోతున్నామనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ టీజర్ ఏ స్థాయిలో ఉండబోతోందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement