Devara: 'దేవర' ఫీవర్.. ఎన్టీఆర్ మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' పైన భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలకు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలు ట్రెండింగ్‌లో నిలవడంతో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. రీసెంట్‌గా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సినిమా టీం ప్రకటించింది.
సెప్టెంబర్ 27న దేవర రిలీజ్
సెప్టెంబర్ 27న 'దేవర' విడుదల కానుంది. ఓవర్సీస్‌లో ముందుగా ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కి కేవలం కొన్ని గంటల్లోనే టికెట్లు సోల్డ్ కావడం గమనార్హం. డల్లాస్‌లోని XD స్క్రీన్‌లో ఫస్ట్ టికెట్స్ అమ్ముడయ్యాయి. యూఎస్‌లో ఇప్పటివరకు 19 ప్రాంతాల్లో 52 షోల కోసం మొత్తం 2,407 టికెట్లు బుక్ అయ్యాయి. దీంతో అక్కడ 75,727 డాలర్ల మేర బిజినెస్ జరిగింది. ప్రీ సేల్ బిజినెస్‌లో 'దేవర' ఇప్పటికే 100K డాలర్ల గ్రాస్ సాధించినట్టు సమాచారం.