Sr NTR: ఎన్టీ రామారావు మొదటి సినిమాకి జీతం ఎంతో తెలుసా?.. చరిత్రలో ఏ హీరో చేయని సాహసం చేశాడు..!
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అనేది ఒక అద్భుతమైన పేరు. తెలుగు సినిమా పరిశ్రమలో ఆయనది ఒక అపురూపమైన పాత్ర. ఆయన పేరు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన గొప్పతనం, నటనా కౌశల్యం, జీవితంలో చేసిన విశేష కృషి. ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకోని వారంటూ ఉండరు. 1951లో విడుదలైన "పాతాళ భైరవి" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగు సినిమా దశ మారింది. అప్పట్లో ఈ చిత్రం "వంద రోజులు" పూర్తి చేసిన తొలి సినిమా గా ప్రసిద్ధి చెందింది. కెవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు లు అద్భుతంగా నటించారు.
"కాశీ మజిలీ" కథల్లోని ఒక భాగం పాతాళ భైరవి
సినిమా కథ ప్రకారం, "పాతాళ భైరవి"లో ఉజ్జయిని యువరాణితో ప్రేమలో పడిన తోటరాముడు (ఎన్టీఆర్) ధనవంతులు కావాలని నేపాలీ మంత్రగాడిని (ఎస్వీ రంగారావు) ఆశ్రయిస్తాడు. కానీ మంత్రగాడి ఆలోచన కాస్త వేరు, ఆయన తోటరాముని బలిపెట్టి పాతాళభైరవి అనుగ్రహం పొందాలని పథకం రచిస్తాడు. కథలో తాంత్రికుడిని ఓడించి, తోటరాముడు విజయం సాధిస్తాడు. ఈ కథ మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన "కాశీ మజిలీ" కథల్లోని ఒక భాగం. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకుండా ఇలాంటి ఫాంటసీ చిత్రం చేయాలనే ఆలోచన గొప్పదే. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కీలకమైన సాహసాలు చేశారు, తద్వారా అది చరిత్రలో నిలిచిపోయింది.
బంతిని కొట్టిన విధానం చూసి తోటరాముని పాత్రకు ఎన్టీఆర్
దర్శకుడు కెవీ రెడ్డి మొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావును తోటరాముడి పాత్ర కోసం ఎంపిక చేసేందుకు అనుకున్నారట. అయితే, ఒక రోజు వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ లు టెన్నిస్ ఆడుతుండగా, ఎన్టీఆర్ బ్యాట్ పట్టుకున్న తీరు, బంతిని కొట్టిన విధానం చూసి, ఆయనను తోటరాముని పాత్రకు ఎంపిక చేసారు. అప్పట్లో డూప్‌లు అందుబాటులో ఉండేవారు కాదు. అప్పట్లో నటులు ప్రతిదీ నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉండేవారు.ఉదయం 4:30 గంటలకు ఎస్వీఆర్, ఎన్టీఆర్ వాహిని స్టూడియోలో ఫైట్ రిహార్సల్స్ చేసేవారు.
తొలి ద్విభాషా చిత్రం పాతాళ భైరవి
ఈ సినిమాలో ఎన్టీఆర్ రెమ్మునరేషన్ ₹250 కాగా, ఆయన రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయడానికి విజయా సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఘంటసాల సంగీతం, మార్కస్ బార్ట్లే కెమెరామెన్‌గా ఈ చిత్రానికి జీవం పోసింది. 1952 జనవరిలో గోవాలో జరిగిన భారతదేశపు తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడిన ఏకైక సౌత్ ఇండియన్ సినిమా "పాతాళ భైరవి". ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన తొలి ద్విభాషా చిత్రం.