
Odela 2 Ott: తమన్నా 'ఓదెల 2' త్వరలో ఓటీటీలోకి? .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన 'ఓదెల 2' సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందన్న వార్తలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చాలా కాలం తరువాత స్ట్రయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.
భోళా శంకర్ తర్వాత ఓదెల 2
ఇటీవలి కాలంలో తమన్నా తమిళ చిత్రం 'అరణ్మనై 4'తో హారర్ థ్రిల్లర్ జోనర్‌లో మెప్పించగా, తెలుగులో మాత్రం 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవికి జోడిగా కనిపించింది.
ఆ తర్వాత ఆమె నటించిన స్ట్రయిట్ తెలుగు మూవీగా 'ఓదెల 2' తెరకెక్కింది.
ఈ సినిమా, ఓటీటీలో మంచి ఆదరణ పొందిన 'ఓదెల రైల్వే స్టేషన్' చిత్రానికి సీక్వెల్‌గా రానుండటంతో, భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
వివరాలు
మౌత్ టాక్‌కు వ్యతిరేకంగా స్పందన
'ఓదెల 2' సినిమా నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి.
కానీ ఏప్రిల్ 18న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయిన తర్వాత, ఈ సినిమాపై వచ్చిన మౌత్ టాక్ మాత్రం ఆశించిన దిశలో లేదు. అభిమానులు, ప్రేక్షకుల అభిప్రాయాలు రివర్స్‌లోనే వినిపిస్తున్నాయి.
వివాదాస్పద రివ్యూలు - మిశ్రమ స్పందన
సినిమా రివ్యూలు కొన్ని చోట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ, సాధారణ ప్రేక్షకుల స్పందన మాత్రం నెగటివ్‌గా మారింది.
కథ అందరికీ తెలిసినట్లుగా ఉండడం,స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేకపోవడం,విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకోకపోవడమే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయితే మొదటి 20 నిమిషాలు మాత్రం కథన పరంగా చక్కగా అలరించాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
బాక్సాఫీస్ వద్ద నిరాశే
రిలీజ్ అయిన మొదటి రోజే సినిమాకు నిరుత్సాహకరమైన టాక్ రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా ఈ చిత్రం పెద్దగా ఆశాజనకంగా కనిపించడం లేదు.
ఓపెనింగ్ డే కలెక్షన్లు కూడా తక్కువగానే నమోదయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఓటీటీ హక్కులపై భారీ డీల్
తాజా సమాచారం ప్రకారం, 'ఓదెల 2' సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియా నివేదిస్తోంది.
అన్ని భాషల కలిపి దాదాపు రూ. 18 కోట్ల డీల్‌కు ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. అయినప్పటికీ సినిమా స్ట్రీమింగ్ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
వివరాలు
త్వరలోనే ఓటీటీలోకి రానుందా?
ప్రస్తుతం సినిమాకు వస్తున్న స్పందనను బట్టి, నెలరోజుల్లోగా లేదా అంతకంటే ముందుగానే 'ఓదెల 2' ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది సూపర్ విజన్ బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా సంపత్ నంది అందించారు.