LOADING...
Dragon: అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్.. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీలో బాలీవుడు నటుడు
అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్.. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీలో బాలీవుడు నటుడు

Dragon: అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్.. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీలో బాలీవుడు నటుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రశాంత్‌ నీల్ - జూనియర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమా 'డ్రాగన్‌' (Dragon, NTR 31) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతోనే అభిమానులు అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించి బాలీవుడ్‌ అగ్ర నటుడు అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు పలు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలను ధృవీకరించగా, అనిల్‌ కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో డ్రాగన్‌ పోస్టర్‌ను షేర్‌ చేసి ఒక సినిమా వచ్చేసింది, మరో రెండు లైన్‌అప్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి అనిల్‌ నటిస్తున్నది ఇది రెండో చిత్రమని చెప్పవచ్చు.

Details

ఎన్టీఆర్‌ సరసన రుక్మిణీ వసంత్

గతంలో వీరిద్దరూ 'వార్‌ 2'లో నటించారు. అలాగే, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్‌' తర్వాత రెండోసారి దక్షిణాది దర్శకుడి చిత్రంలో అనిల్‌ కపూర్‌ నటిస్తున్నారు. అయితే ఆయన ఏ పాత్రలో కనిపించనుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. 'దేవర' తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ సినిమా 'సలార్‌' తర్వాత ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న రెండో ప్రాజెక్ట్‌. ఎన్టీఆర్‌ సరసన ఇందులో రుక్మిణీ వసంత్‌ నటిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకోగా, తారక్‌ (ఎన్టీఆర్‌) మునుపెన్నడూ చేయని మాస్‌ పాత్రలో విభిన్నమైన లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Advertisement