Biker OTT: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. శర్వానంద్ 'బైకర్' ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ రేసింగ్ యాక్షన్ థ్రిల్లర్ బైకర్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీకి సిద్ధమైంది. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన వెలువడింది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న శర్వానంద్, 'బైకర్'తో మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి రానుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflixలో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సోమవారం (ఏప్రిల్ 27) నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
వివరాలు
కీలక పాత్రలో రాజశేఖర్
తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 'బైకర్' భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ నేపథ్య చిత్రం అనే ప్రత్యేకతను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి ప్రదర్శన కనబరిచింది. ఇందులో శర్వానంద్‌కు జోడీగా మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఈ చిత్రంలో శర్వానంద్‌కు తండ్రిగా, రేసింగ్ మెంటార్‌గా కనిపించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించినది అభిలాష్ రెడ్డి. ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.