
భగవంత్ కేసరి ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం భగవంత్ కేసరి.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్లలో జోరు పెంచేందుకు భగవంత్ కేసరి టీం సిద్ధమయ్యింది.
ఈ నేపథ్యంలో భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీన భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల కాబోతుందని అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడి చేసారు.
Details
సమయాన్ని వెల్లడి చేయని మేకర్స్
ట్రైలర్ విడుదల తేదీని వెల్లడి చేశారు కానీ ఏ సమయంలో విడుదల చేస్తారనేది మాత్రం తెలియజేయలేదు.
భగవంత్ కేసరి సినిమా నుండి ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. గణేష్ ఆంథెమ్ ఇంకా ఉయ్యాల ఉయ్యాల అనే రెండు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
దీంతో భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమాను హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు.
తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం, దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.