Page Loader
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబో ఫిక్స్: అధికారిక ప్రకటన వచ్చేసింది 
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబో సినిమాపై అధికారిక ప్రకటన రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబో సినిమాపై అధికారిక ప్రకటన

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబో ఫిక్స్: అధికారిక ప్రకటన వచ్చేసింది 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 11, 2023
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

జైలర్ సినిమాతో రజనీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత జైలర్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నారు సూపర్ స్టార్. ఆ ఆనందంలో అభిమానులు ఉండగానే రజనీకాంత్ 171వ సినిమాపై ఖతర్నాక్ అప్డేట్ వచ్చింది. రజనీకాంత్ 171వ సినిమా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఉంటుందని సన్ పిక్చర్స్ సంస్థ వెల్లడి చేసింది. గతంలో ఈ కాంబినేషన్ పై అనేక వార్తలు వచ్చాయి, ప్రస్తుతం ఆ వార్తలన్నీ నిజమయ్యాయి. రజనీకాంత్ కెరీర్లో 171 సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Details

వచ్చే ఏడాది మొదలు కానున్న 171వ సినిమా 

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమా మొదలు కావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రజనీకాంత్ జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో 170వ సినిమా చేయబోతున్నాడు. ఇటువైపు లోకేష్ కనగరాజ్ కూడా తళపతి విజయ్ తో లియో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరి సినిమాలు పూర్తయిన తర్వాత 171 వ సినిమా మొదలుకానుంది. అంటే వచ్చే సంవత్సరం చివర్లో రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందే సినిమా, సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కళానిథి మారన్ నిర్మిస్తున్న రజనీకాంత్ 171వ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో ఇంకా వెల్లడి చేయలేదు.