సైంధవ్ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్
విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం సైంధవ్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతున్న సైంధవ్ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. సైంధవ్ సినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్ వీడియో రిలీజైంది. తాజాగా టీజర్ విడుదలపై అప్డేట్ అందించారు. సైంధవ్ సినిమా టీజర్ ను అక్టోబర్ 16వ తేదీన విడుదల చేస్తామని చిత్రబృందం అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా విడుదలకు మూడు నెలల సమయం ఉండగా, టీజర్ ను విడుదల చేయడానికి సైంధవ్ టీమ్ సిద్ధమవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న సైంధవ్ సినిమాలో ఆండ్రియా జెర్మియా నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, జనవరి 13వ తేదీన విడుదల అవుతుంది.