
OG: ఇవాళే 'ఓజీ' ప్రీ రిలీజ్ వేడుక.. పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై ఉత్కంఠ!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. గతంలో హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వకపోవడంతో, ఈసారి ఓజీతో సూపర్ హిట్ సాధించాలని పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమన్ అందించిన మ్యూజిక్ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. రిలీజ్‌కు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పీక్‌కు చేరింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్ నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
Details
భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం
ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరుకానుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల నుండి పవర్ స్టార్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం ఉంది. టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరుకాబోతున్నట్టు సమాచారం. అదే విధంగా, ఈ ఈవెంట్‌ను కనివిని ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్పెషల్ ప్రోగ్రామ్‌తో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలో పవర్ స్టార్ ప్రసంగం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఓజీపై నెలకొన్న క్రేజ్ చూస్తుంటే, రిలీజ్ రోజునే వరల్డ్ వైడ్‌గా రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.