LOADING...
OG : ఆగస్ట్ 15న 'ఓజి' సర్‌ప్రైజ్.. మరో మాస్ ట్రీట్‌కి రంగం సిద్ధం!
ఆగస్ట్ 15న 'ఓజి' సర్‌ప్రైజ్.. మరో మాస్ ట్రీట్‌కి రంగం సిద్ధం!

OG : ఆగస్ట్ 15న 'ఓజి' సర్‌ప్రైజ్.. మరో మాస్ ట్రీట్‌కి రంగం సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఓజి'పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తికాగా, ప్రస్తుతం ఎడిటింగ్‌ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాల మధ్యలో సమయం కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన అప్‌డేట్స్‌ చూస్తే, 'ఓజి' టీమ్ ప్రమోషన్‌లో ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. పవన్ కళ్యాణ్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్‌ను పూర్తిగా వినియోగించుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరోసారి తన మ్యూజిక్ మాజిక్‌తో ఆకట్టుకున్నాడు.

Details

మరో సాంగ్ రిలీజయ్యే అవకాశం

అలాగే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఆగస్టు 15న ఓ సాలిడ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారని టాక్. అది టీజర్ అయి ఉండొచ్చు, లేక మేకింగ్ వీడియో, లేదా మరో సాంగ్ అయినా కావచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, మాస్ యాక్షన్ మూడ్, గ్రాండ్ విజువల్స్‌ చూపించే అవకాశం ఉందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, అభిమానుల్లో మాత్రం జోష్ పెరుగుతోంది. ఇప్పటి దాకా 'ఓజి' కంటెంట్‌తోనే కాకుండా, ప్రచార కార్యక్రమాల పరంగా కూడా మంచి హైప్‌ను సృష్టిస్తోంది. మొత్తానికి యూనిట్ ప్లాన్ చూస్తుంటే, ఈ సినిమా అభిమానులకు పండగలా ఉంటుందనడంలో సందేహం లేదు.