Page Loader
Om Bheem Bush: శ్రీవిష్ణు,శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో ఓం భీమ్ బుష్
శ్రీవిష్ణు,శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో ఓం భీమ్ బుష్

Om Bheem Bush: శ్రీవిష్ణు,శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో ఓం భీమ్ బుష్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 22, 2024
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్‌". కొద్దిసేపటి క్రింద ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో బ్రోచేవారెవరురా కాంబినేషన్ శ్రీవిష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణలు వ్యోమగామి వేషధారణలో, చేతిలోకరపత్రాలతో గ్రామీణ నేపథ్యంలో నడుచుకుంటూ వెళ్లడం మనం చూడవచ్చు. ప్రీతి ముకుందన్,అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించగా,శ్రీకాంత్ అయ్యంగార్,ఆదిత్య మీనన్,రచ్చ రవి కీలక పాత్రలలో నటించారు. మరి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వస్తున్నా ఈ చిత్రం ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సన్నీఎం ఆర్ సంగీతం అందిస్తుండగా వి సెల్యులాయిడ్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూవీ క్రియేషన్స్ చేసిన ట్వీట్