LOADING...
Om Shanti Shanti Shantihi: 'ఓం శాంతి శాంతి శాంతి' ట్రైలర్ రిలీజ్.. ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

Om Shanti Shanti Shantihi: 'ఓం శాంతి శాంతి శాంతి' ట్రైలర్ రిలీజ్.. ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2026
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః' (Om Shanti Shanti Shantihi) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా దర్శకత్వం ఎ.ఆర్‌. సజీవ్ నిర్వహించారు. మలయాళంలో హిట్ అయిన 'జయ జయ జయ జయహే' చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ జనవరి 30న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ సోషల్‌ మీడియా ద్వారా సినిమా ట్రైలర్‌ను (Om Shanti Shanti Shantihi Trailer) రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదటి నుంచి చివరి దాకా ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం.

Advertisement