Page Loader
Santosham Awards 2023: ఈ సారి గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్: సురేష్ కొండేటి 
Santosham Awards 2023: ఈ సారి గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్: సురేష్ కొండేటి

Santosham Awards 2023: ఈ సారి గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్: సురేష్ కొండేటి 

వ్రాసిన వారు Stalin
Nov 08, 2023
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

2023కు సంబంధించిన సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌పై కీలక ప్రకటన వెలువడింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఈ ఏడాది గోవాలో డిసెంబర్ 2న నిర్వహించబోతున్నట్లు 'సంతోషం' అధినేత సురేష్ కొండేటి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సంతోషం అవార్డ్స్‌కు సహకరిస్తున్న మీడియా, ఇండస్ట్రీ, మిత్రులు, జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గోవాలో డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే 'సంతోషం OTT అవార్డ్స్' అవార్డ్స్‌ను ఈ నెల 18న ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. గతేడాది నుంచి OTT అవార్డులను కూడా ఇస్తున్నట్లు ఆయన వివరించారు. తామే మొదటిసారిగా ఓటీటీ అవార్డ్స్‌ను ఇస్తున్నట్లు చెప్పారు.

సినిమా

మరో మూడేళ్లు అవార్డ్స్ ఇస్తాం: సురేష్

'సంతోషం' నుంచి 25 ఏళ్ల పాటు అవార్డులు అందజేయాలని కోరుకున్నానని, దాదాపు 22 ఏళ్లు పూర్తయ్యాయని, కచ్చితంగా మరో మూడేళ్లు అవార్డుల వేడుకను నిర్వహిస్తామని సురేష్ కొండేటి చెప్పారు. 'సంతోషం' మ్యాగజైన్‌ను ప్రారంభించినప్పుడు తాను చాలా చిన్నవాడిని, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర నటులందరి ప్రోత్సాహంతో అవార్డులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సురేష్ కొండేటి ఫిల్మ్‌ఫేర్ స్థాయిలో అవార్డులను కూడా నిర్వహించగలరని టాలీవుడ్ కింగ్ నాగార్జున అన్న విషయాన్ని ఆయన ఈ సందర్భగా గుర్తు చేసుకున్నారు. అవార్డ్స్ నిర్వహణ విషయంలో గోవా ప్రభుత్వ సహకారం మరువలేనిదని సురేష్ చెప్పారు.