Page Loader
Operation Valentine: పవర్ ప్యాక్డ్ ఫైనల్ స్ట్రైక్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్,సల్మాన్ 

Operation Valentine: పవర్ ప్యాక్డ్ ఫైనల్ స్ట్రైక్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్,సల్మాన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2024
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా ప్రాజెక్ట్ ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా మార్చి 1, 2024న తెలుగు,హిందీలో భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా,భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కింది. 2019 ఫిబ్రవరి 14 న భారత సైన్యంపై జరిగిన ఓ దారుణ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆపరేషన్ వాలెంటైన్ తెలుగు,హిందీ ట్రైలర్‌లను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఆవిష్కరించారు. రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ తన రోల్ లో ఇంటెన్స్ గా, డైనమిక్ గా కనిపిస్తున్నాడు. అలాగే హీరోయిన్ మానుషి చిల్లర్ తెలుగు డైలాగ్స్ ని ఈజ్ గా చెప్పినట్టు కనిపిస్తుంది.

Details 

నెక్స్ట్ లెవెల్లో  విజువల్స్  

అలాగే దర్శకుడు భారతదేశ ఎమోషన్ ని బాగా హ్యాండిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ట్రైలర్ లో ఎమోషన్స్ అలాగే విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక్క షాట్ ఇది గ్రాఫిక్స్ అన్నట్టుగా అనిపించడం లేదు. ట్రైలర్ లో ఎమోషన్స్ అలాగే విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక్క షాట్ ఇది గ్రాఫిక్స్ అన్నట్టుగా అనిపించడం లేదు. నవదీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్ కీలకపాత్రలలో నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని,గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలు. ఆపరేషన్ వాలెంటైన్ కి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రామ్ చరణ్ చేసిన ట్వీట్