Page Loader
Oscar Awards 2024: ఆస్కార్ లో దుమ్ము రేపిన 'ఓపెన్‌హైమర్'.. విజేతల పూర్తి జాబితా ఇదే 
ఆస్కార్ లో దుమ్ము రేపిన 'ఓపెన్‌హైమర్'.. విజేతల పూర్తి జాబితా ఇదే

Oscar Awards 2024: ఆస్కార్ లో దుమ్ము రేపిన 'ఓపెన్‌హైమర్'.. విజేతల పూర్తి జాబితా ఇదే 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2024
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్కార్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా కొనసాగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే,ఈసారి కూడా ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది నటీనటులు ఆస్కార్ అవార్డును గెలుచుకునే రేసులో పాల్గొన్నారు. US అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం విజేతను ప్రకటించింది. అకాడమీ అవార్డుల కార్యక్రమం భారత కాలమానం ప్రకారం మార్చి 11న ఉదయం 4:30గంటలకు ప్రారంభమైంది,ఆతర్వాత విజేతల పేర్లు ఒక్కొక్కటిగా వెల్లడయ్యాయి. వివిధ విభాగాల్లో 'ఓపెన్‌హైమర్' కోసం మొత్తం 13 నామినేషన్లు వచ్చాయి,వాటిలో క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 7 అవార్డులను గెలుచుకుంది.

Details 

విజేతల పూర్తి జాబితా ఇదే

ఉత్తమ చిత్రం - ఓపెన్ హైమర్ ఉత్తమ నటుడు - కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్) ఉత్తమ నటి - ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ దర్శకుడు - క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటుడు - రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటి - డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) ఉత్తమ సినిమాటోగ్రఫీ - ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ) బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ - వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌- 20 డేస్ ఇన్ మరియూపోల్ బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే- కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)

Details 

విజేతల పూర్తి జాబితా ఇదే

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే - జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌) బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌) బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ - ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ - ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ - ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్‌న్) బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా) బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ - ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్) బెస్ట్‌ సౌండ్‌ - ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)

Details 

విజేతల పూర్తి జాబితా ఇదే

బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌) బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ - నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌) బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం-ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)