Page Loader
oscars 2025: ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!
ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!

oscars 2025: ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2025
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ ప్రపంచం అంతటా ఆస్కార్ అవార్డుల సంబరం ఉత్సాహంగా ప్రారంభమైంది. 'ఎ రియల్ పెయిన్'లో తన అద్భుత నటనతో కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా, అదే సమయంలో 'ఎమిలియా పెరెజ్'లో జోయా సాల్దానా తన ప్రావీణ్యంతో ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు. అదనంగా, 'వికెడ్' చిత్రానికి పాల్ తేజ్‌వెల్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పురస్కృతుడై, 'ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్' ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్‌గా ఎంపికయ్యింది. 97వ అకాడెమీ అవార్డుల విభిన్న కేటగిరీల కోసం వైవిధ్యమైన చిత్రాలు ఎంపికయ్యాయి. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న ఈ ఘన వేడుకలో హాలీవుడ్ ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణులు అందరూ హాజరయ్యారు.

వివరాలు 

అతిధులతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్‌ చిట్‌చాట్‌

నటీమణులు తమ ట్రెండీ దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచానికి కొత్త భాష్యం చెప్పారు. ఈ వేడుక సంబంధిత ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వేడుకి హాజరైన అతిథులతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్‌ చిట్‌చాట్‌ చేశారు. 97వ అకాడెమీ వేడుకను ఏబీసీ, జియో హాట్‌స్టార్‌, స్టార్ మూవీస్‌, హులు, యూట్యూబ్ టీవీ, ఫుబోటీవీ, ఏటీ అండ్‌టీ టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. అరియానా గ్రాండే, సింథియా ఎరివో, డోజా క్యాట్‌, లిసా, క్వీన్ లతీఫా, రేయ్‌లు తమ విశేష ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.

వివరాలు 

ఆస్కార్‌ విజేతలు వీళ్లే.. 

ఉత్తమ సహాయ నటుడు - కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌) ఉత్తమ సహా నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్) ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనోరా (సీన్‌ బేకర్‌) ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే - కాన్‌క్లేవ్‌ (పీటర్‌ స్ట్రాగన్‌) ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - వికెడ్‌ (పాల్‌ తేజ్‌వెల్‌) ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ - ది సబ్‌స్టాన్స్‌ ఉత్తమ ఎడిటింగ్ - అనోరా (సీన్‌ బేకర్‌) ఒరిజినల్‌ సాంగ్‌ - ఎల్‌ మాల్‌ (ఎమిలియా పెరెజ్‌)

వివరాలు 

ఆస్కార్‌ విజేతలు వీళ్లే.. 

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ - వికెడ్‌ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌- ది ఓన్లీ గర్ల్ ఇన్‌ ది ఆర్కెస్ట్రా డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ - నో అదర్‌ ల్యాండ్‌ ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ - ఫ్లో ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ - ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌