ఆస్కార్ అవార్డ్స్ 2023: వైవిధ్యమైన ఫ్యాషన్ తో రెడ్ కార్పెట్ మీద మెరిసిన తారలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో తారలు తమ ఫ్యాషన్ తో అందరినీ ఆకట్టుకున్నారు. రెడ్ కార్పెట్ మీద నడుస్తూ, చూపరులను తమవైపు ఆకర్షించుకున్నారు.
అలా విభిన్నంగా కనిపించిన వారి జాబితా ఇక్కడ చూద్దాం.
జూనియర్ ఎన్టీఆర్:
ఆర్ఆర్ఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద విభిన్నంగా కనిపించారు. భారతీయ వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నాడు. నల్లటి డ్రెస్ మీద పులిబొమ్మ డిజైన్ కలిగిన డ్రెస్ ను ఎన్టీఆర్ ధరించారు.
ఆ పులి డిజైన్ కి కారణం చెబుతూ, ఆర్ఆర్ఆర్ లో పులితో ఫైట్ సీన్ ని గుర్తు చేసాడు. అలాగే భారత జాతీయ జంతువు పెద్దపులి కాబట్టి, రెడ్ కార్పెట్ మీద ఇండియా నడుస్తున్నట్టుగా ఉంటుందని వివరించాడు.
ఆస్కార్ అవార్డ్స్
నలుపు రంగులో తళుకుమన్న దీపికా పదుకునే
దీపికా పదుకునే
ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద బాలీవుడ్ భామ దీపికా పదుకునే, నలుపు రంగు గౌనులో తళుక్కుమని మెరిసింది. చాలా సింపుల్ గా ఆకర్షణీయంగా కనిపించింది. ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటను పరిచయం చేసిన దీపికా పదుకునే, తన మాటలతో అందరినీ ఆకట్టుకుంది.
రిహాన్నా:
హాలీవుడ్ సింగర్ రిహానా, బ్లాక్ కలర్ డ్రెస్ లో వైవిధ్యంగా కనిపించింది. గర్భంతో ఉన్న రిహాన్నా ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద అందంగా నడిచింది.
ఇంకా, ఉత్తమ నటుడు గా అవార్డు అందుకున్న బ్రెండన్ ఫ్రేజర్, బ్లాక్ సూట్ లో మెరిసాడు. మొత్తానికి ఆస్కార్ సంబరం, చాలా హాయిగా గడిచింది.