Oscar 2025: ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ.. ఉత్తమ నటి మైకీ
ఈ వార్తాకథనం ఏంటి
యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన 'అనోరా' (Anora)కు అవార్డుల జల్లు కురిసింది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఈ సినిమా ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకుంది.
'ది బ్రూటలిస్ట్'లో తన అద్భుత నటనకుగాను అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, 'అనోరా'లో నటనకుగాను మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు.
'అనోరా' చిత్రానికి దర్శకత్వం వహించిన సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు.
వివరాలు
గతేడాది బాక్సాఫీస్‌ను శాసించిన 'డ్యూన్: పార్ట్ 2'
'ఎ రియల్ పెయిన్' సినిమాకుగాను కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు.
అలాగే, 'ఎమిలియా పెరెజ్'లో నటనకుగాను జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకున్నారు.
గతేడాది బాక్సాఫీస్‌ను శాసించిన 'డ్యూన్: పార్ట్ 2' చిత్రం ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో ఆస్కార్‌ను దక్కించుకుంది.
అయితే, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్ పొందిన 'అనూజ' చిత్రానికి మాత్రం నిరాశ ఎదురైంది.
ఈ విభాగంలో 'ఐ యామ్ నాట్ ఏ రోబో' ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది.
వివరాలు
లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ అకాడెమీ అవార్డులు
లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగిన 97వ అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ప్రముఖ తారలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
ఫ్యాషన్ రంగానికి కొత్త నిర్వచనం ఇస్తూ, నటీమణులు ట్రెండీ దుస్తుల్లో మెరిశారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆస్కార్ అవార్డుల వేడుకలో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్ ప్రముఖ అతిథులతో చిట్‌చాట్ చేశారు.
అరియానా గ్రాండే, సింథియా ఎరివో, డోజా క్యాట్, లిసా, క్వీన్ లతీఫా, రేయ్‌లు తమ అద్భుత ప్రదర్శనలతో హాజరైన వారిని ఆకట్టుకున్నారు.