
ఆహా నుండి షాకింగ్ అప్డేట్: న్యూస్ పేపర్ ను లాంచ్ చేసేందుకు రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా నుండి షాకింగ్ అప్డేట్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా, న్యూస్ పేపర్ ని తీసుకురావడానికి ఆహా ప్రయత్నిస్తుందని వినిపిస్తోంది.
అవును, ఆహా నుండి దిన పత్రిక రాబోతున్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. కరోనా టైమ్ లో ప్రారంభమైన ఆహా, అనతి కాలంలోనే తెలుగులో బాగా పాపులర్ అయ్యింది.
ఆహాలోని షోస్ కూడా మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఆహా ద్వారా అందుబాటులో ఉంటున్నాయి.
ఆహాకు పెరుగుతున్న ఆదరణ కారణంగా తమిళంలోనూ ఆహాను స్టార్ట్ చేసారు. అక్కడ కూడా ఆహాకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఆహా
జులై 1నుండి మొదలుకానున్న ఆహా పేపర్
అయితే ఈ మధ్య కాలంలో ఆహా నష్టాల్లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. వస్తున్న ఆదాయం కన్నా పెరుగుతున్న ఖర్చు ఎక్కువగా ఉండడంతో ఆహా నష్టాల్లోకి వెళ్ళిందని అన్నారు.
ఆ న్యూస్ ఇంకా పాతబడక ముందే సడెన్ గా ఆహా నుండి న్యూస్ పేపర్ రావడం ఆశ్చర్యమే. జులై 1వ తేదీ నుండి ఈ దినపత్రిక అందుబాటులో ఉంటుందని, ఆహా పేరుతోనే ఈ దినపత్రిక మొదలవుతుందని అంటున్నారు.
ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారికంగా సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రింట్ మీడియాలోకి మొదటగా అడుగు పెట్టి, ఆ తర్వాత డిజిటల్ మీడియా వైపు వస్తారని చెబుతున్నారు.
అల్లు అరవింద్ సడెన్ గా న్యూస్ పేపర్ వైపు ఎందుకు మొగ్గు చూపారో వేచి చూడాలి.