LOADING...
OTT Movies: సినిమా లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి కొత్త కంటెంట్
సినిమా లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి కొత్త కంటెంట్

OTT Movies: సినిమా లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి కొత్త కంటెంట్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 25, 2026
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వీకెండ్‌ ఓటీటీ వేదికలపై ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. విభిన్న కథాంశాలతో వచ్చిన ఈ చిత్రాలు వినోదాన్ని రెట్టింపు చేయనున్నాయి. సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ హీరోగా మరియా రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హ్యాపీ రాజ్‌'. ఇందులో శ్రీగౌరి ప్రియ కథానాయికగా నటించగా, నటుడు అబ్బాస్‌ దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌లో ఉంది.

వివరాలు

ఓటీటీలోకి ఫ్రెష్ కంటెంట్..

'కోర్ట్‌' సినిమాతో ప్రేక్షకాదరణ పొందిన హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంటగా నటించిన తాజా చిత్రం 'బ్యాండ్‌ మేళం' కూడా ఓటీటీలోకి అడుగుపెట్టింది. మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జీ5లో ప్రసారమవుతోంది. సతీశ్‌ జివ్వాజీ దర్శకత్వం వహించగా, ప్రముఖ రచయిత కోన వెంకట్‌ నిర్మించారు. శ్రీనాథ్‌ మాగంటి ప్రధాన పాత్రలో, బాల సతీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ గ్రామీణ కథాచిత్రం 'మెన్షన్ హౌస్ మల్లేష్‌'. గాయత్రి రమణ కథానాయికగా నటించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ వారం జియో హాట్‌స్టార్‌లో విడుదలైన రాజకీయ థ్రిల్లర్‌ డ్రామా 'ప్రతిఛాయ' ఆసక్తిని రేకెత్తిస్తోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‌లో ఉంది.

వివరాలు

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనవి ఇవే..

నీ ఫరెవర్‌ (మూవీ) - తమిళ్‌/తెలుగు నుక్కడ్‌ నాటక్‌ (మూవీ) - హిందీ కోకోమెలాన్‌ లేన్‌ (వెబ్‌సిరీస్‌) - ఇంగ్లీష్‌ కిల్‌ టోనీ మేనియా (మూవీ) - ఇంగ్లీష్‌ అన్‌చూజెన్‌ (మూవీ) - ఇంగ్లీష్‌/తెలుగు హల్క్‌ హోగన్‌: రియల్‌ అమెరిన్‌ (వెబ్‌సిరీస్‌) - ఇంగ్లీష్‌/తెలుగు స్ట్రేంజర్‌ థింగ్స్‌ (వెబ్‌సిరీస్‌) - ఇంగ్లీష్‌ అపెక్స్‌: హంట్‌ ఆర్‌ బి హంటెడ్‌ (మూవీ) - ఇంగ్లీష్‌/తెలుగు అన్‌ కామన్‌ వాలోర్‌ (మూవీ) - ఇంగ్లీష్‌ దిస్‌ ఈజ్‌ ఏ గార్డెనింగ్‌ షో (మూవీ) - ఇంగ్లీష్

Advertisement

వివరాలు

అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్నవి:

ఫ్రమ్‌ 4 (వెబ్‌సిరీస్‌) - ఇంగ్లీష్‌ కెవిన్‌ (వెబ్‌సిరీస్‌) - ఇంగ్లీష్‌ కిల్లింగ్‌ గ్రౌండ్స్‌: ది గిల్గో బీచ్‌ మర్డర్స్‌ (వెబ్‌సిరీస్‌) - ఇంగ్లీష్‌ ఆల్ఫా: మెన్‌ లవ్‌ వెన్జెన్స్‌ (మూవీ) - కన్నడ, తెలుగు

Advertisement