పొన్నియన్ సెల్వన్ 2: డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆ నిబంధన తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 2, థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి, శోభిత ధూళిపాళ్ళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, గతకొన్ని రోజుల నుండి ఓటీటీలో అందుబాటులో ఉంది.
నిన్నటి వరకు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడాలంటే అద్దె చెల్లించి చూడాల్సి వచ్చేది. ఇప్పటి నుండి ఎలాంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు.
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రయిబర్స్ అందరూ పొన్నియన్ సెల్వన్ 2 సినిమాను చూడవచ్చు.
తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో ఈరోజు ఉచితంగా స్ట్రీమింగ్ కానుందని చిత్రబృందం ప్రకటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓటీటీలోకి పొన్నియన్ సెల్వన్ 2
step into the world of grandeur and intrigue as this epic saga continues! 💫#PS2onPrime, watch now
— prime video IN (@PrimeVideoIN) June 1, 2023
Available in Tamil, Telugu, Kannada and Malayalamhttps://t.co/6lYhjbXDZJ pic.twitter.com/DTUFwPQRky