
హ్యాపీ బర్త్ డే మణిరత్నం: భారతదేశం గర్వించదగ్గ దర్శకుడి జీవితంపై ప్రత్యేక కథనం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ సినిమా పరిశ్రమ దిగ్గజ దర్శకులలో మణిరత్నం ముందు వరుసలో ఉంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు క్లాసిక్స్ గా నిలిచాయి.
ప్రేమకథలు తెరకెక్కించడంలో మణిరత్నం స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. రోజా, సఖి, గీతాంజలి, బొంబాయి, దిల్ సే, కడలి, ఓకే బంగారం ఇలా ప్రతీ సినిమా, ప్రేక్షకులకు సరికొత్త ప్రేమానుభూతిని పంచుతుంది.
ఈరోజు మణిరత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా మణిరత్నం కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
సినిమాల్లోకి రాకముందుకు చెన్నైలో ఒకానొక మేనేజ్మెంట్ కన్సల్టెంట్ లో జాబ్ చేసారు మణిరత్నం. ఆయనకు ఎంబీఏ ఫైనాన్స్ లో డిగ్రీ ఉంది.
Details
ఆస్కార్స్ అధికారిక సినిమాలు
సినిమా నేపథ్యం నుండి ఇండస్ట్రీకి వచ్చిన మణిరత్నం, తన మొదటి సినిమాను(పల్లవి అనుపల్లవి) కన్నడలో తెరకెక్కించారు. ఈ సినిమా 1983లో రిలీజైంది.
మొదటి సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత 1986లో వచ్చిన మౌనరాగం సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.
1987లో మణిరత్నం దర్శకత్వం వహించిన నాయకుడు సినిమా రిలీజైంది. ఈ సినిమాతో మణిరత్నం ఖ్యాతి మరింత పెరిగింది. 1987లో ఇండియా నుండి ఆస్కార్ అవార్డుల అధికారిక ఎంట్రీగా ఎంపికైంది ఈ సినిమా. కానీ నామినేషన్ దక్కించుకోలేదు.
1991లో అంజలి సినిమా కూడా ఇండియా నుండి ఆస్కార్స్ అవార్డులకు అధికారిక ఎంట్రీగా ఎంపికైనప్పటికీ నామినేషన్ రాలేదు.
Details
సినిమా ఫెయిలైనందుకు పోలీస్ కేసు
కెరీర్ లో సక్సెస్ లే కాదు ఫెయిల్యూర్స్ కూడా మణిరత్నంను వెంటాడాయి. 2013లో కడలి సినిమా రిలీజై తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, మణిరత్నంపై పోలీస్ కేసు ఫైల్ చేసారు.
2015లో ఓకే బంగారం సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు మణిరత్నం. ఆ తర్వాత మళ్ళీ విజయాల బాట పట్టారు.
తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తన కెరీర్ లో 6జాతీయ అవార్డులను, 4ఫిలిమ్ ఫేర్ అవార్డులను, 6ఫిలిమ్ ఫేర్ సౌత్ అవార్డులను అందుకున్నారు. 2002లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.