Loading...
Korean Kanakaraju: 'కొరియన్ కనకరాజు' ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అంటే?
'కొరియన్ కనకరాజు' ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అంటే?

Korean Kanakaraju: 'కొరియన్ కనకరాజు' ఓటీటీ రిలీజ్‌ ఫిక్స్‌.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్‌ అంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2026
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. చాలాకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న వరుణ్‌ తేజ్‌కు ఈ సినిమా మంచి ఊరటనిచ్చింది. 'గద్దలకొండ గణేష్‌' తర్వాత ఆయన నటించిన పలు సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరుస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన 'కొరియన్ కనకరాజు' సక్సెస్‌ టాక్‌ సొంతం చేసుకుంది. వరుణ్‌ తేజ్‌కు చాలా రోజుల తర్వాత హిట్‌ రావడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సత్య తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు.

వివరాలు

రూ.50 కోట్ల క్లబ్‌లోకి.. 

వరుణ్‌ తేజ్‌కు జోడీగా రితిక నాయక్‌ కథానాయికగా నటించింది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన 'కొరియన్ కనకరాజు' తాజాగా రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది.

ఓ ప్రాంతీయ సినిమా కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులు సినిమాను చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఇప్పుడు ఆసక్తికరమైన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌ సొంతం?

'కొరియన్ కనకరాజు' ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్‌ ఏకంగా రూ.26 కోట్లు చెల్లించినట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ సెప్టెంబర్‌ 10 లేదా 11న ప్రారంభమయ్యే అవకాశం ఉందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే స్ట్రీమింగ్‌ తేదీపై కూడా ఇప్పటివరకు అధికారిక క్లారిటీ లేదు. త్వరలోనే చిత్రబృందం ఓటీటీ రిలీజ్‌, స్ట్రీమింగ్‌ డేట్‌పై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న 'కొరియన్ కనకరాజు'.. ఓటీటీలోనూ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT