All We Imagine As Light: ఓటీటీలోకి 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్'.. ఎప్పుడు , ఎక్కడ చూడాలి
కని కుశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' (All We Imagine as Light) ఒక ప్రత్యేకమైన కథతో రూపొందించబడిన డ్రామా ఫిల్మ్. ఈ సినిమాను దర్శకురాలు పాయల్ కపాడియా రూపొందించారు. ఇది ఆమె తొలి ఫీచర్ ఫిల్మ్. కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడిన ఈ సినిమా 'గ్రాండ్ పిక్స్' అవార్డును గెలుచుకుంది. అంతేకాక, గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ + హాట్ స్టార్ తాజా ప్రకటనలో వెల్లడించింది. జనవరి 3 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలిపింది.
తెలుగులో ఈ చిత్రాన్ని రానా విడుదల చేశారు
ఈ సినిమా కథ ముంబయిలోని ఒక నర్సింగ్ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల ప్రయాణం ఆధారంగా ఉంటుంది. ఈ ఇద్దరు నర్సులు కలిసి ఓ బీచ్ టౌన్‌కు రోడ్ ట్రిప్ నడుపుతారు.ఆ తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? అన్నదే ఈ సినిమాకి ప్రధాన కథాంశం. అంతర్జాతీయ పబ్లికేషన్స్ నుంచి ఈ సినిమాకు మంచి రివ్యూలు లభించాయి. కేన్స్ ఫెస్టివల్‌లో 'గ్రాండ్ పిక్స్' అవార్డు సాధించడం భారతీయ సినిమాలకు 30 సంవత్సరాల తర్వాత వచ్చిన గౌరవంగా భావిస్తున్నారు. ఈ సినిమా బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయ్యింది. తెలుగులో ఈ చిత్రాన్ని రానా విడుదల చేశాడు.