Nara Rohith: పాన్ ఇండియా ఛాన్స్ చేజారింది.. షెకావత్ రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఇతడే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాతో ఆయన పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఈ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్‌కు ఇది కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సంచలన విజయం సాధించగా, ఆ తర్వాత వచ్చిన 'పుష్ప 2' ఆ విజయాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. 'పుష్ప 2' సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డులు సృష్టించింది. ఇండియాలోనే అత్యంత వేగంగా రూ.1000 కోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్ర సృష్టించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1265 కోట్ల వసూళ్లు సాధించింది.
Details
యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్
ఈ రెండు భాగాల్లోనూ అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా 'పుష్ప 2'లోని జాతర సీన్‌లో ఆయన నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు, యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఇదిలా ఉండగా, 'పుష్ప' సినిమాలో ఓ కీలక పాత్రను తాను మిస్ అయ్యానని టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'భైరవం' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన ఆయన, 'పుష్ప' సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని చెప్పారు.
Details
ఆ పాత్ర బాగా నచ్చింది
కరోనా సమయంలో మీసాలతో ఉన్న తన ఫోటోను నిర్మాత పంపించి, 'పుష్ప' సినిమాలో షెకావత్ పాత్ర గురించి వివరించారని రోహిత్ తెలిపారు. ఆ పాత్ర తనకు బాగా నచ్చిందని కూడా చెప్పారు. అయితే సుకుమార్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని భావించడంతో అన్ని భాషల నుంచి నటులను ఎంపిక చేస్తున్నారని, చివరకు ఆ పాత్రకు ఫహద్ ఫాజిల్‌ను తీసుకున్నారని నారా రోహిత్ వెల్లడించారు. ఈవ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. 'పుష్ప' లాంటి భారీ సినిమాలో ఆ పాత్ర చేసి ఉంటే నారా రోహిత్ కెరీర్ పూర్తిగా మలుపు తిరిగేదని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడంటూ కామెంట్స్ వైరల్‌గా మారాయి.