Swayambhu: పాన్ ఇండియా లెవెల్ యాక్షన్.. నిఖిల్ 'స్వయంభు' నుంచి థ్రిల్లింగ్ అప్‌డేట్
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో 'స్వయంభు' ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా కనిపించనుండగా, పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. పిరియాడికల్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న 'స్వయంభు' ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్‌లతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Details
ప్రధాన హైలెట్ గా ఇంటర్వల్ సీక్వెన్స్ మూవీ
స్వయంభు సినిమాలో ఇంటర్వల్ సీక్వెన్స్ ప్రధాన హైలైట్‌గా నిలవనుందట. ఈ కీలక సన్నివేశంలో నిఖిల్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అత్యంత వైల్డ్‌గా, రా (Raw) ఫీల్‌తో తెరకెక్కించారట. ముఖ్యంగా ఈ సీక్వెన్స్‌లో నిఖిల్ గెటప్, యుద్ధ సన్నివేశాల సెటప్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయని సమాచారం. ఈ యాక్షన్ ఘట్టాన్ని మరింత ప్రభావవంతంగా చూపించేందుకు 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ అందిస్తున్న నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించనుండగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లనున్నాయట.
Details
నిఖిల్ అభిమానుల్లో ఉత్సాహం
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఏర్పడిన హైప్‌కు ఈ తాజా యాక్షన్ అప్‌డేట్ మరింత ఊపునిస్తోందని నిఖిల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చూస్తే, 'స్వయంభు' కేవలం ఒక సినిమా కాదు.. నిఖిల్ కెరీర్‌లోనే కీలకమైన పాన్ ఇండియా మైలురాయిగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.