
స్టార్ అయినా ప్రభాస్ మారలేదని చెప్పడానికి నిదర్శనమే సాచి ట్రైలర్ లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
పెద్ద హీరోలకు పెద్దగా సమయం ఉండదు. ఇది వందశాతం నిజం, ఆ పెద్ద హీరో చేతిలో ఐదారు సినిమాలుంటే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ కాలేరు.
కానీ ప్రభాస్ స్టైలే వేరు. బాహుబలి సినిమాతో ఇండియాను షేక్ చేసి బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన తర్వాత కూడా ప్రభాస్ శైలి మారలేదు. అదే హుందా, అదే తీరు.
ఎవ్వరు పిలిచినా వెళ్ళిపోతారు. ప్రభాస్ హుందాతనానికి సింప్లిసిటీకి నిదర్శనంగా సాచి ట్రైలర్ లాంచ్ నిలిచిందని చెప్పవచ్చు. సాచి ఒక చిన్న సినిమా. పేరున్న యాక్టర్లు లేరు. పేరున్న దర్శకుడు కూడా కాదు. అయినా కూడా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చాడు.
ప్రభాస్
మహిళా సాధికారత మీద తీసిన చిత్రంగా సాచి
స్టార్ మేకర్ సత్యానంద్ సన్నిహితులు వివేక్ పోతగాని రూపొందించిన సాచి ట్రైలర్ లాంచ్ చేయడానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వచ్చారు.
ట్రైలర్ లాంచ్ ప్రభాస్ చేతుల మీద జరిగిన తర్వాత స్టార్ మేకర్ సత్యానంద్ మాట్లాడుతూ, ప్రభాస్ ని తానెప్పుడూ ఏదీ అడగలేదనీ, సాచి ట్రైలర్ ని ప్రభాస్ లాంచ్ చేస్తే బాగుంటుందని తను ఫీలయ్యాడని, అడగ్గానే ప్రభాస్ ఒప్పుకున్నట్లు సత్యానంద్ వివరించారు.
ఇక సాచి ట్రైలర్ విషయానికి వస్తే, తెలంగాణలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా తెర్కెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మహిళలు ఉద్యోగం చేయాలన్న అంశంపై ఈ మూవీ ఉంటుందని చిత్ర దర్శక నిర్మాత వివేక్ పోతగాని వివరించారు. మార్చ్ 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుంది.